HomeTelugu TrendingBigg Boss 8 Telugu నుండి మణికంఠ ఎలిమినేషన్ వెనుక అసలు మిస్టరీ ఏంటో తెలుసా?

Bigg Boss 8 Telugu నుండి మణికంఠ ఎలిమినేషన్ వెనుక అసలు మిస్టరీ ఏంటో తెలుసా?

Mystery behind Manikanta's elimination from Bigg Boss 8 Telugu
Mystery behind Manikanta’s elimination from Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu elimination:

Bigg Boss 8 Telugu లో ఈ వారం ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. నాగ మణికంఠను ఎలిమినేట్ చేయడం ఒక సంచలన నిర్ణయం అయింది, అయితే ఈ నిర్ణయం ప్రేక్షకుల ఓట్ల వల్ల వచ్చినది కాదు, స్వయంగా నాగ మణికంఠ తీసుకున్న నిర్ణయం. కానీ, ఇందులో ఒక కుట్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది.

సాధారణంగా, ప్రతి శనివారం ఎలిమినేషన్ వివరాలు అప్‌డేట్‌ అవుతాయి. అనధికారికంగా లీక్ అవుతాయి. ఈసారి కూడా అదే జరిగింది. ప్రథ్విరాజ్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని చాలా మంది బిగ్ బాస్ రివ్యూయర్స్, బ్లాగర్స్ ప్రచారం చేశారు. కొన్ని వీడియోలు, కామెంట్లు కూడా పెట్టారు. సీజన్ 6 కంటెస్టెంట్ ఆది రెడ్డి కూడా ఒక వీడియో పెట్టి ప్రథ్వి ఎలిమినేషన్‌ను ధృవీకరించాడు.

కానీ, కొన్ని గంటలలోనే పరిస్థితులు మారిపోయాయి. సాధారణంగా, శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లు ఒకే రోజు షూట్ చేస్తారు. ప్రథ్వి రాజ్ ఎలిమినేషన్ వార్త బయటకు వచ్చినప్పుడు, ఆదివారం ఎపిసోడ్ షూట్ ప్రారంభం కాలేదు. కొన్ని గంటల వ్యవధిలో, నిర్ణయం మారిపోయింది, అన్ని రివ్యూయర్స్ నాగ మణికంఠ ఎలిమినేషన్ గురించి పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇది ప్రేక్షకులలో ఆశ్చర్యాన్ని కలిగించింది.

నాగ మణికంఠ, గౌతమ్ కృష్ణ ఇద్దరూ చివరి ఎలిమినేషన్ స్థాయికి చేరుకున్నారు. గౌతమ్ కృష్ణ ఈ వారం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు, కానీ చివరికి అతని విషయంలో కూడా ఏదో తప్పు జరిగింది అని టాక్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున ప్రకటన ప్రకారం, గౌతమ్ కి నాగ మణికంఠ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఎలిమినేట్ అయినది నాగ మణికంఠ అని చెప్పారు. దీనికి కారణం, అతను ఆట ఆడటంలో సరిగా పాల్గొనలేకపోవడమే అని అన్నారు.

ఇందులో కుట్ర ఉంది అని అనిపిస్తుంది. గౌతమ్ పరిస్థితిని అనుకూలంగా మార్చడానికి, ప్రథ్విరాజ్ ను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజానికి, నాగ మణికంఠ, ప్రథ్విరాజ్ మధ్య తుది ఎలిమినేషన్ జరిగి ఉంటే, అది మరింత బాగుండేది అని అనిపిస్తోంది.

అసలు సమస్య, షో టీమ్ గౌతమ్‌ను డైలమా లో పెట్టి, ప్రథ్విని కాపాడటానికి ప్రయత్నించడం. ఇది ఆడియెన్స్‌లో ఆశ్చర్యం, అనుమానం కలిగించింది. ప్రస్తుతానికి గౌతమ్‌కి మద్దతు ఎక్కువగా ఉన్నప్పటికీ, అతనిని ఇలా చర్చలోకి తీసుకురావడం అతని ఆటపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Read More: హై కోర్టును ఆశ్రయించిన Allu Arjun.. ఎందుకో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu