HomeTelugu Trendingబిగ్‌బాస్‌: కాఫీ కోసం శివాజీ గోల

బిగ్‌బాస్‌: కాఫీ కోసం శివాజీ గోల

Bigg Boss 7 Telugu Promo

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై మూడో రోజులు అవుతుంది. తాజా గా విడుదలైన ప్రోమోతో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ పై కేకలు వేస్తూ హంగామా చేయడంతో పాటు కోపంతో అరవడం వీడియోలో చూడొచ్చు. కాఫీ కోసం గోల చేస్తున్న శివాజీతో బిగ్ బాస్ కాసేపు ఆడుకున్నాడు.

హౌస్ లోకి బీపీ మిషన్ పంపించి శివాజీ బీపీ చెక్ చేయాలని మిగతా సభ్యులకు సూచించాడు. దీనిపై శివాజీ మండిపడ్డాడు. తాను ఓవైపు ఇబ్బంది పడుతుంటే జోకులేస్తావా? అంటూ బిగ్ బాస్ పై అరిచాడు. తన సమస్యను చూపించి మిగతా సభ్యులకు వినోదం పంచాలని అనుకుంటున్నావా? అంటూ బిగ్ బాస్ ను నిలదీశాడు. తనకు హౌస్ లో ఉండడం ఇష్టంలేదని, కనీస అవసరాలు తీర్చని ఈ హౌస్ లో తాను ఉండనని స్పష్టం చేశాడు. తలుపు తీస్తే తాను బయటకు వెళ్లిపోతానని చెప్పాడు.

మరి శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోయాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. గతంలోనూ చాలా మంది కంటెస్టెంట్‌లు ఇలా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే నామినేషన్ల పర్వం మొదలైంది. లోపల ఉన్న కంటెస్టెంట్లలో 14 మందిలో 8 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. దామిని, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక, షకీలాలలో ఒకరు ఈ వారంలోనే బయటకు రానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu