HomeTelugu Trendingబిగ్‌బాస్‌-6 అప్డేట్‌

బిగ్‌బాస్‌-6 అప్డేట్‌

Bigg boss 6 telugu update

3)మూడో కంటెస్టెంట్‌:  హౌస్‌లోకి బిగ్‌బాస్‌‌-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్‌ అయిన శ్రీహాన్‌ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సిరితో కలిసి పలు షార్ట్‌ఫిల్మ్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో గుర్తింపు పొందాడు. సిరిపై సోషల్‌ మీడియా అంతా ట్రోలింగ్‌ చేస్తున్న శ్రీహాన్‌ మాత్రం ఆమెకు అండగా నిలబడ్డాడు. సిరి బాయ్‌ఫ్రెండ్‌గా వార్తల్లో నిలిచిన శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ -6లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది.

3

4)నాలుగో కంటెస్టెంట్‌: యాంకర్‌గా నేహా చౌదరి.. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి ఇచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా నేహా చౌదరి మాంచి పాపులారిటీని దక్కించుకుంది. తెలుగుమ్మాయిగా బాంబే గడ్డపై యాంకరింగ్‌తో అలరించిన నేహా మరిప్పుడు బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చింది.

4

5) ఐదోవ కంటెస్టెంట్‌: చలకీ చంటీ హౌస్‌ లో ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో నటించినా ప్రముఖ కామెడీ షోతోనే చలాకీ చంటీ పాపులర్‌ అయ్యాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలతో అలరించే చంటీ బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.

5

6) ఆరోవ కంటెస్టెంట్‌: నటి శ్రీసత్య (మంగళంపల్లి శ్రీసత్య) ఎంట్రీ ఇచ్చింది. 2015లో మిస్‌ విజయవాడ టైటిల్‌ గెలిచింది. నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందింది.

6

7) ఎడోవ కంటెస్టెంట్‌: 2013లో ‘చిన్న సినిమా’ అనే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించాడు. వరుడు కావలెను, ఉప్మా తినేసింది, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు.

7

8) ఎనిమిదోవ కంటెస్టెంట్‌: సోషల్‌ మీడియాలో.. గీతూ రాయల్‌ మంచి ఫాలోయింగ్‌ ఉంది. తన యాసతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్‌ బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయ్యింది. టిక్‌టాక్‌ స్టార్‌గా యూట్యూబర్‌గా గీతూ రాయల్‌కు బాగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక జబర్దస్త్‌లో ఆమె చేసిన పుష్ప స్కిట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్‌ నైట్‌లో పాపులారిటీ దక్కించుకుంది.

9

9)తొమ్మిదోవ కంటెస్టెంట్‌: టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘ఆర్య’ సినిమాలో అ అంటే అమలాపురం.. పాటతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలకు హోస్ట్‌గానూ అలరించింది. 2014లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది. దాదాపు 9ఏళ్ల పాటు తెలుగు తెరకు దూరంగా ఉన్న అభినయ శ్రీ బిగ్‌బాస్‌-6తో రీఎంట్రీ ఇస్తున్నారు.

8

10)పదోవ కంటెస్టెంట్‌: మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం. అమెరికా అమ్మాయి, ఉయ్యాల జంపాల సీరియల్‌లో నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. మరోవైపు మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రోహిత్‌ ‘నీలికలువలు’,’అభిలాష’,’కంటే కూతుర్నే కనాలి’ వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు. ఈ జంట 2017లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరి ఈ జోడీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.

10

11) పదకొండోవ కంటెస్టెంట్‌ : బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ తరువాత పలు సినిమాలో నటించిన బాలాదిత్య జంబలకిడిపంబ, హిట్లర్‌, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్‌, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోగా `చంటిగాడు` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 40 సినిమాల్లో నటించగా, హీరోగా 10 సినిమాలు చేశాడు. 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత యాంకర్‌గానూ గుర్తింపు పొందాడు. 2006లో బాలాదిత్య వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. తాజాగా మరో పాపాయి కూడా పుట్టింది.

12

12) పనెండోవ కంటెస్టెంట్ :   మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతీ కృష్ణన్‌ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో.. ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్‌తో పరిచయమైంది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాలో నటించింది. ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవలె దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రంలో నటించింది.

11

13) పదమూడోవ కంటెస్టెంట్ : 2003లో సై సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు షానీ. స్వతహాగా అథ్లెటిక్‌గా నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ అందుకున్న షానీ ఆ తర్వాత ఘర్షణ, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్‌, గ్రే లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. 2021లో వచ్చిన రామ్‌ అసుర్‌ చిత్రంలో శివన్నగా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.

13

14) పదనాల్గొవ కంటెస్టెంట్‌: ఇనయా సుల్తానా ఎంట్రీ డ్యాన్స్‌తో స్టేజ్‌పై దుమ్ముదులిపింది. 14వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. కాంట్రవర్సీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన డ్యాన్స్‌ వీడియోతో ఓవర్‌ నైట్‌లో పాపులర్‌ అయ్యింది ఈ బ్యూటీ. బుజ్జీ ఇలారా,అవ్యోం జగత్‌.. సహా కొన్ని చిత్రాల్లో ఆమె నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

14

15) పదిహేనవ కంటెస్టెంట్: సుంకర సూర్యనారాయణ (కొండబాబు) అలియాస్‌ ఆర్జే సూర్య. తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆర్జే సూర్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి సూర్యకు మిమిక్రీపై ఆసక్తి ఉండేది. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఆర్జే సూర్య చేసిన మిమిక్రీ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. ఇక అప్పటి నుంచి మిమిక్రీపై మరింత ఇష్టం పెంచుకున్న సూర్య ఆ దిశగా కష్టపడేవాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు.

15

16) పదహారవ కంటెస్టెంట్: జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్‌ ఫైమా. తనపై బాడీ షేమింగ్ చేస్తున్నా ఫైమా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తుంది. ఈమె వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే. తనదైన శైలిలో కమెడీతో అలరించే ఫైమా బిగ్‌బాస్‌ షోలో ఎంత వరకు మెప్పిస్తుందో చూద్దాం. ఇక కమెడియన్‌ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్లు స్టేజ్‌పైనే ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది ఫైమా.

16

17) పదిహేడవ కంటెస్టెంట్‌: బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయిన యూట్యూబర్‌ ఆది రెడ్డి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఫ్రెండ్‌ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్‌ సీజన్‌-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్‌ చేయగా ఆ వీడియో పాపులర్‌ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి బిగ్‌బాస్‌ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు.

17

18) పద్దెనిమిదవ కంటెస్టెంట్‌: మోడల్‌ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు.

19

19) కంటెస్టెంట్‌: యాంకర్‌ అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి ఎంట్రీ ఇచ్చింది. లైఫ్‌లో తాను పడిన కష్టాలను స్టేజ్‌పై వివరించింది.

18
20) కంటెస్టెంట్‌: సింగర్‌ రేవంత్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu