తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్- 5’ నిన్న ఆదివారంతో ముగిసింది. ముందుగా వార్తలు వచ్చినట్లుగానే బిగ్‌బాస్ -5 తెలుగు టైటిల్‌ను వీజే సన్నీ కైవసం చేసుకున్నాడు. దీనితో పాటు టీవీఎస్ బైక్, 50 లక్షలు, సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో 300 చదరపు గజాల భూమిని గెలుచుకున్నాడు సన్నీ. ఈ సీజన్‌లో షణ్ముక్ జశ్వంత్ రన్నర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ఫినాలేలో బిగ్‌బాస్ ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు.
ఒక సీజన్ ముగియగానే ఆ నెక్ట్స్ సీజన్ రావడానికి 5 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నెక్ట్స్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు నాగ్ తీపి కబురు అందించాడు. ససాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము.
కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుంది అని తెలిపాడు. అంటే నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే కొత్త సంవత్సరం వచ్చిన రెండు నెలలకు అంటే మార్చి లేదా ఎప్రీల్ బిగ్‌బాస్ 6 సీజన్ స్టార్ట్ కానుంది అన్నమాట.