HomeTelugu Trendingనారాయణ- నారాయణ అనడంపై నాగార్జున స్పందన

నారాయణ- నారాయణ అనడంపై నాగార్జున స్పందన

Bigg boss 6 nagarjuna respo
తెలుగు ‘బిగ్ బాస్- 6’ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు కూడా టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోను ముందు నుంచి కూడా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ షోను నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న ఒక బూతుల స్వర్గంగా ఆయన అభివర్ణించారు. బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అని, డబ్బు కోసమే నాగార్జున ఇలా చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు గత శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతూ… భార్యాభర్తలైన మెరీనా, రోహిత్ లను హగ్ చేసుకోమని అడిగారు. వాళ్లు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… ‘నారాయణ.. నారాయణ… వాళ్లు పెళ్లయిన వాళ్లు’ అని కామెంట్ చేశారు. అయితే, సీపీఐ నారాయణను ఉద్దేశించే నాగార్జున ఈ కామెంట్ చేశారని. దీనిపై నారాయణ కూడా సెటైర్‌ వేసినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై తాజాగా నాగార్జున స్పందిస్తూ… ఎవరైనా జోక్ చేస్తే తాను ‘నారాయణ.. నారాయణ’ అంటానని చెప్పారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల ఆటను విశ్లేషించుకుంటుంటే తనకు లైఫ్ సైన్స్ లా అనిపిస్తుందని అన్నారు. కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, పరిచయం లేని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం చిన్న విషయం కాదని చెప్పారు. ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి తాను వెళ్లాలనుకోవడం లేదని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu