తెలుగు బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీ.. షణ్నూ, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
I’ve accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from @raghavtrs Planted 3 saplings. Further I am nominating @shannu__7 #SiriHanmanth @Sreeram_singer to plant 3 trees & continue the chain! Special thanks to @MPsantoshtrs garu for taking this initiative! pic.twitter.com/hHxCv4ZDGk— Sunny Vj (@vjsunnyofficial) December 23, 2021