HomeTelugu Trendingసెప్టెంబర్ 5న 'బిగ్ బాస్-5' కర్టెన్ రైజర్

సెప్టెంబర్ 5న ‘బిగ్ బాస్-5’ కర్టెన్ రైజర్

Bigg boss 5

తెలుగు ‘బిగ్ బాస్-5 షో త్వరలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంటులను పరిచయం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తారు. ఈ షోను కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్’కు సంబంధించిన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.

“బిగ్ బాస్ సీజన్ 5”ల లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. అయితే కొందమంది పేర్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యాంకర్ రవి, వర్షిణి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, నవ్య స్వామి, యానీ మాస్టర్, ఆట సందీప్, వి.జె. సన్నీ, ఆర్జే కాజల్ పోటీదారులుగా పాల్గొనబోతున్నట్లు టాక్‌. అయితే ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచిన “బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలుపుతూ రాత్రి మరోసారి పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ షో అనుకున్న సమయానికే ప్రసారం కానుంది అనే విషయాన్నీ స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu