HomeTelugu Big Stories'వదిలేస్తున్నావా సిరి'... బిగ్‌బాస్‌ స్టేజ్‌పై శ్రీహాన్‌

‘వదిలేస్తున్నావా సిరి’… బిగ్‌బాస్‌ స్టేజ్‌పై శ్రీహాన్‌

bigg boss 5 telugu more fam
తెలుగు బిగ్‌బాస్‌-5లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూడటంతో హౌస్‌మేట్స్‌ బాగా ఎమోషనల్‌ అయ్యారు. అయితే యాంకర్‌ రవి, కాజల్‌ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్‌నే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు.

bigg boss 51

తాజాగా మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్‌ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్‌ ఫ్రెండ్‌, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ సైతం బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది.

bigg boss 52

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ‘వదిలేస్తున్నావా సిరి’.. అంటూ శ్రీహాన్‌ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్‌ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్న శ్రీహాన్‌..అలా ‘వదిలేస్తున్నావా సిరి’.. అని ఎందుకు అడిగాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu