HomeTelugu Trendingబిగ్‌బాస్‌: మానస్- శ్రీరామచంద్ర ఎలిమినేట్

బిగ్‌బాస్‌: మానస్- శ్రీరామచంద్ర ఎలిమినేట్

sreerama chandra and manas
బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి టాప్‌-5 నుండి రెండో కంటెస్టెంట్‌గా మానస్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి వచ్చి హౌస్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి వెళ్లిన వీళ్లు టాప్‌-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్‌ చేశారు. ‘ఇప్పుడు.. ఈ సమయంలో ఎవరైనా ఈ సూట్‌కేస్‌లో ఉన్న డబ్బు కావాలనుకుంటే తీసుకుని వెళ్లిపోవచ్చు’ అని నాని ఆఫర్‌ ఇవ్వగా, నలుగురూ తిరస్కరించారు. రెండోసారి కూడా ఆఫర్‌ ఇస్తానని నాగార్జున ప్రకటించినా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం జరిగిన ఎలిమినేషన్‌లో మానస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు.

ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మానస్‌ మాట్లాడుతూ.. ‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. మనకు ఎంత ఓపికున్నా తక్కువేనని ఇక్కడ నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ సీజన్‌-5 టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఉంటాడు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. ఎవరు టైటిల్‌ గెలిచినా మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ నచ్చితే వాడే విన్నర్‌’ అని సమాధానం ఇచ్చాడు. నటి శ్రియా శరణ్ తన డాన్స్‌తో స్టేజ్‌పై మెస్మరైజ్‌ చేసింది.

ప్రో కబడ్డి లీగ్‌ సపోర్ట్‌గా నాగచైతన్య స్టేజ్‌పై ప్రమోట్‌ చేశాడు. ప్రో కబడ్డి లీగ్‌ పోస్టర్‌, యాడ్‌ లాంచ్‌ చేశారు. నాగచైతన్య హౌస్‌ లోకి గెల్డ్‌టోన్‌ బ్యాక్స్‌ తో వెళ్లాడు.. దీనినికూడా ఎవరు తీసుకోవాడానికి ముందుకు రాలేదు. ఎలిమినేషన్‌ పక్రియ ద్వారా శ్రీరామ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన శ్రీరామచంద్ర తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఈ షోలో అడుగుపెట్టానని, చివరకు అది సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. హౌస్‌లో చాలా నేర్చుకున్నానన్న శ్రీరామ్‌ రేపటినుంచి నాలో కొత్త పర్సన్‌ను చూస్తారని తెలిపాడు. వెళ్లిపోయే ముందు చివరిసారిగా ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..’ అంటూ మెలోడీ సాంగ్‌ అందుకున్నాడు. ఈ పాట వింటూ శ్రీరామ్‌ తల్లితో పాటు హమీదా కంటతడి పెట్టుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu