HomeTelugu Trending'బిగ్‌బాస్‌-5' స్టేజ్‌పై తారల సందడి

‘బిగ్‌బాస్‌-5’ స్టేజ్‌పై తారల సందడి

Bigg Boss 5 Final Episode P

తెలుగు తెరపై అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ముగింపు దశకు చేరుకుంది. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైంది. టాప్‌-5లో ఉన్న మానస్‌, శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరిలలో విజేతగా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సుమారు 104 రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో గ్రాండ్‌ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది.

Bigg Boss 1

ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ నుంచి రాజమౌళి, ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ నుంచి రణ్‌బీర్‌కపూర్‌, ఆలియాభట్‌, ‘పుష్ప’ ప్రమోషన్స్‌ కోసం రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. ఇక సాయిపల్లవి, నాని.. హౌస్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో సందడి చేశారు. మరోవైపు కంటెస్టెంట్‌ల ఇంటిసభ్యులు, ఎలిమినేటై ఇంటికి వచ్చిన తోటి కంటెస్టెంట్స్‌ల డ్యాన్స్‌లు, పాటలతో ఈ వేడుకలు మరింత సందడిగా జరగనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!