తెలుగు బిగ్‌బాస్-5 కంటెస్టెంట్స్‌ని ట్రోలింగ్ చేయడం, నెగెటివ్ ప్రచారాలు చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెల్స్‌పై యాంకర్ రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం పోటీదారుల గురించే కాకుండా వారి కుటుంబసభ్యులపైనా నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన రవి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటినుంచి ఇతరుల గురించి తప్పు మాట్లాడాలన్నా, వారి గురించి ఆన్‌లైన్‌లో ఎలాంటి వెకిలిరాతలు రాయాలన్నా భయం కలగాలి. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు కచ్చితంగా కఠినచర్యలు చేపడుతారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో అసత్యవార్తలపై పోలీసులకు ఆధారాలతోపాటు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మీరు చేయాల్సింది మీరు చేయండి.. ‘నేను చేయాల్సింది నేను చేస్తా. కానీ ద్వేషపూరిత సందేశాలు పెట్టేముందు ఒక 30 సెకన్లు ఆలోచించండి’ అని పేర్కొన్నారు. తనను ట్రోల్స్ చేసిన వారి పేర్లు, స్క్రీన్ షాట్స్ ని ఆధారాలుగా పోలీసులకు చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram