HomeTelugu Trendingహారిక నా చెల్లెలు: అభిజిత్‌

హారిక నా చెల్లెలు: అభిజిత్‌

Bigg boss 4 winner Abhijeet
తెలుగు బిగ్‌బాస్‌-4 విన్నర్‌గా అభిజిత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభం నుండి అభిజిత్‌, మోనాల్, అఖిల్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ నడిచిన సంగతి తెలిసిందే. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురి బిగ్‌బాస్‌లో హైలైట్‌ గా నిలిచేవాడు. ఆ తరువాత కొన్ని రోజులకు అభిజిత్‌.. మోనాల్‌తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్‌- మోనాల్‌ ప్రేమాయణాన్ని హైలైట్‌ చేసి చూపించాడు బిగ్‌బాస్‌. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్‌, లాస్య ఎలిమినేట్‌ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్‌లు, ముద్దులను హైలెట్‌ చేసి చూపించాడు బిగ్‌బాస్‌. దీంతో అభికి హారిక మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ అంటూ వార్తలు వినిపించాయి.

ఇక ఆ పుకార్లు నిజమే అన్నట్లు హారిక కూడా అభిజిత్‌ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోయింది. చాలా సందర్భంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను హైలైట్ చేస్తూ ఏదో నడుస్తుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్. దీంతో అభి-హారిక పేర్లను ఏకం చేసి అభిక అని ఫ్యాన్స్ పేజ్‌లు కూడా వచ్చేశాయి. వీరిద్దరూ కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టారని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక వీరిద్దరి పేరెంట్స్‌ కూడా పరోక్షంగా వాళ్లు లవ్‌లోనే ఉన్నారని ఒప్పేసుకున్నారు. హారిక లాంటి కోడలు కావాలని అభి తల్లి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే హారిక తల్లి చెప్పడంతో వీరద్దరి గుండెల్లో గంట మోగిందని ఫ్యాన్స్‌ సంబరపడ్డారు.

ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu