బిగ్‌బాస్ సీజన్-4 సందడి మొదలైంది. 16మంది సభ్యులతో ప్రారంభించిన ఈ షోలో ఇద్దరిని స్పెషల్ కంటెస్టెంట్స్‌గా ఓ రూమ్‌లో ఉంచారు. ఇంట్లో 14 మంది సభ్యుల సందడి ప్రారంభమైపోయింది. రెండోవ రోజే చిన్నచిన్న తగాదాలు, తోటి సభ్యుల ఓదార్పులు షురూ అయిపోయాయి. ఈ సీజన్‌లో తొలి నామినేషన్ పక్రియ మొదలైంది. అయితే 7 జంటలు అంటే ముందుగా నాగ్ ఇచ్చిన గిఫ్ట్‌ల ద్వారా జత అయిన సభ్యులు ఓ జంటగా ఏర్పడ్డారు. హాల్లో కిటికీలను ఉంచారు. ఒక్కో జంట ఆ కిటీకి వెనుక నిల్చోవాలి. కుటుంబ సభ్యులందరూ చర్చించుకుని ఆ జంటలో ఒకరిని నామినేట్ చేయాలి. నామినేట్ అయిన వారి కిటికీ తలుపును మూసివేయాలి.
1. అభిజిత్, దేత్తడి హారికలు నామినేషన్ కోసం వెళ్లి కిటికీల దగ్గరకు వెళ్లగా.. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్లిద్దరిలోనూ అభిజిత్‌ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు.
2. సూర్యకిరణ్, యాంకర్ దేవిలు వెళ్లగా.. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో సూర్య కిరణ్2ని నామినేట్ చేశారు.
3. కరాటే కళ్యాణి, అఖిల్ సార్థక్‌లు వెళ్లగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అఖిల్ సార్థక్‌ని నామినేట్ చేశారు.
4. రాజశేఖర్, దివిలు కిటికీల దగ్గరకు వెళ్లగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో దివిని నామినేట్ చేశారు.
5. లాస్య, మోహబూబాలు వెళ్లగా ఇంటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో మొహబూబాని నామినేట్ చేశారు. దీంతో లాస్య సేవ్ అయ్యింది.
6. సుజాత, మెనాల్‌లు వెళ్లగా సుజాతను నామినేట్ చేసింది కళ్యాణి. దీంతో సూజాత, కళ్యాణి మధ్య వార్ జరిగింది. కళ్యాణి ఆవేశంతో ఊగిపోయింది. మొత్తానికి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సుజాతను నామినేట్ చేయశారు. అయితే కరాటే కళ్యాణి విశ్వరూపంతో హౌస్ మొత్తం రచ్చ రచ్చగా మారింది.
7.గంగవ్వ, నోయల్‌లు వెళ్లగా.. ఇంటి సభ్యులందరూ గంగవ్వను నామినేట్ చేశారు.
కాగా ఈ వారం.. రాజశేఖర్, యాంకర్ లాస్య, యాంకర్ సుజాత, మొనాల్, యాంకర్ దేవి, సూర్య కిరణ్‌లు మొత్తం గంగవ్వను ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు.