బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న మొనటి వరుకు సైలెంట్‌గా ఉన్న దివి నోరు విప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంటి ఇంటి సభ్యులు కూడా ఆమెతో కలిసిపోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సూర్య కిరణ్, మరీ ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ ఆమెతో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజశేఖర్ దివిపై పొగడ్తల వర్షం కురిపించాడు. “మంచి క్యారెక్టర్, అందం ఉంది, మనందరితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్, నేను హీరో.. సరేనా” అని కబుర్లు చెప్పాడు. తనకు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే ఇష్టమని దివి కూడా చెప్పుకొచ్చింది దీంతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన మాస్టర్ పొరపాటున కూరలో టీ పొడి వేసి వంటను నాశనం చేశాడు. ఏదేమైనా ఒక్క ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో దివిపై ఉన్న అభిప్రాయమే మారిపోయింది.
Ammai influence tho #AmmaRajasekhar cooking fasak!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/0ohk7xopEg
— starmaa (@StarMaa) September 11, 2020