HomeTelugu Big Storiesబిగ్‌బాస్-4 తెలుగు (9 సెప్టెంబర్ 2020) హైలైట్స్

బిగ్‌బాస్-4 తెలుగు (9 సెప్టెంబర్ 2020) హైలైట్స్

Bigg Boss 4 september 9th

ఇవాళ బిగ్‌బాస్‌ హౌస్‌లో స్పెషల్ గెస్టులు అరియానా, సోహాల్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే ఇంటి సభ్యులతో ఫోన్ ఎందుకు కట్ చేశారు, మేము ఫుడ్ లేకుండా ఉన్నామని గొడవ పడ్డారు. కంటెస్టెంట్స్ మధ్య దీనిపై రభస జరిగింది. మీరు ఒక్కరోజు తిండిలేకపోతే ఇంత బాధ పడుతున్నారు. మూడు రోజులుగా గంగవ్వ టీ లేకుండా ఇబ్బంది పడుతుందని నోయల్ అన్నాడు. అభిజిత్-సోహాల్ మధ్య కొట్టుకున్నంత సీన్ జరిగింది. కొంతసేపు వాగ్వాదం తర్వాత ఆ ఇద్దరికీ మిగతా కంటెస్టెంట్స్ ఫుడ్ ఇచ్చారు. దాంతో కొంచె కూల్ అయ్యారు సభ్యులు. అయితే అరియానా మాత్రం నాకు ఎవరైనా తినిపిస్తేనే తింటాను అంటూ మొండికేసింది. అఖిల్ తినిపించడానికి ముందుకెళ్తే వద్దని మిగతావారంతా వారించారు. ఆమె తినకుండా ఉండటం చూసి కరాటే కళ్యాణి తినిపించడానికి ముందుకొచ్చింది.

దీంతో మీరు నామినేషన్‌లోకి వచ్చినా సిద్ధమేనా అంది. ఏమైనా పర్వాలేదంటూ కల్యాణి తినిపించింది. దీంతో ఇంట్లో మరో గొడవ చెలరేగింది. మీరు ఎందుకు తినిపించారు అని సభ్యులంతా కల్యాణికి హితబోధ చేశారు. దీంతో కళ్యాణి మరోసారి ఏడ్చేసింది. అఖిల్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. మరుసటి రోజు అమ్మడు లెట్స్‌డు కుమ్ముడు సాంగ్‌తో మొదలైంది. అందరూ కసరత్తులు చేస్తుంటే గంగవ్వ కూడా డంబుల్స్‌ తీసుకుని తానూ చేసింది. రేపటి ఎపిసోడ్‌లో టాస్క్‌తో పాటు గంగవ్వ కామెడీ ఉన్నట్టు ప్రోమోలో చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu