బిగ్‌బాస్ హౌస్‌లో కాస్త సందడి మొదలైంది. నిన్నఇంటిసభ్యులు సరదా టాస్క్‌లో ఎంటర్టైన్ చేశారు. అభిజిత్ వద్దన్నా గారాబం చేస్తూ అతనికి గోరు ముద్దలు పెడుతూ అదే ప్లేటులో హారిక కూడా భోజనం చేసింది. అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి రొమాంటిక్ డ్యాన్సు, నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారని అభిజిత్ మోనాల్‌కు చెప్పుకొచ్చాడు. నాకూ ఒకరు ఉండేవారని మోనాల్ చెప్పుకొచ్చింది. సరేగానీ నాతో మాట్లాడతా అని ఒట్టేయమని అభిజిత్ మరీ మరీ అడిగాడు. ఆ తర్వాత హారికకు నువ్వంటే ఇష్టమని మోనాల్ చెప్పింది. కానీ నీకు మాత్రం నేనంటే ఇష్టం లేదు కదూ అని అడిగాడు. ఇష్టం లేకపోతే నీతో కూర్చుని ఇన్ని గంటలు మాట్లాడతారా? అనిమోనాల్ ముసిముసిగా నవ్వుతూ సమాధానమిచ్చింది.
అఖిల్ పులిహోర కలిపితే, సోహైల్ తాళింపు పులిహోర చేస్తాడని దివి అంది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో పొట్టి బట్టలేసుకుని హారిక చేసిన ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ హైలైట్. అవ్వతో కలిసి చేసిన స్కిట్ ఆకట్టుకుంది. దండం పెట్టి తన వల్ల కాదన్నప్పటికీ తర్వాత మళ్లీ అదే సాహసానికి పూనుకుని విజయవంతంగా ఎత్తాడు. భోజనం సమయంలో అఖిల్ మోనాల్‌కు అన్నం తినిపించడంతో అభిజిత్ ముఖం వాడిపోయింది. అనంతరం సుజాత కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లి టాస్క్ వివరాలు రాసి ఉన్న లేఖను తీసుకెళ్లి చదివింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బీబీ టీవీ టాస్క్ ఇచ్చారు.
టాస్క్‌లో భాగంగా ఇంటిసభ్యులు అత్తా అల్లుడు-అమెరికా మోజు సీరియల్ చేశారు. గయ్యాలి అత్తగా కళ్యాణి, ఆమె కొడుకు, కోడలుగా అభిజిత్, సుజాత, కళ్యాణి కూతురిగా దివి, అమెరికా అబ్బాయిగా అఖిల్, పుల్లలు పెట్టే పనిమనిషిగా దేవి, మతిమరుపు అకౌంటెంట్‌గా సాయికుమార్ పాత్రలను అల్లుకుపోయారు. సీరియల్ మధ్యలో కమర్షియల్ యాడ్ చేస్తున్న నోయల్, హారిక, సోహైల్, అరియానాలను గంగవ్వ చీపురు పట్టుకుని చితక్కొట్టింది. మరో యాడ్.. ఇందులో అటు మోనాల్ కుటుంబం, ఆమెను చూడటానికి వచ్చే పెళ్లికొడుకుగా అమ్మ రాజశేఖర్ కుటుంబం కూడా విగ్గు బ్యాచే.
బ్రేక్ తరువాత సీరియల్ సుఖాంతం అయింది. ఇన్నీ రోజులకు కాస్త ఆసక్తికరంగా సాగింది బిగ్‌బాస్. ఇక రేపటి ఎపిసోడ్లో అభిజిత్, మోనాల్, అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరింత ముందుకు వెళ్తున్నట్లు ప్రొమో ద్వారా తెలుస్తోంది.