HomeTelugu Trendingబిగ్‌బాస్‌: సూజాత ఔట్‌

బిగ్‌బాస్‌: సూజాత ఔట్‌

sujatha eliminated from houతెలుగు బిగ్‌బాస్‌-4లో వీకెండ్‌ కావడంతో నాగర్జున షోలో సందడి చేశారు. ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్‌లు చేయించారు. ఈవారం నామినేషన్‌లో మొత్తం 9 మంది ఉండగా.. వారిలో గంగవ్వ ఎలిమినేట్ అవుతూ అఖిల్‌ను సేవ్ చేసి వెళ్లిపోయింది. అలాగే సోహైల్ కూడా సేవ్ అయ్యాడు. మొత్తం మీద ఆదివారం నాటికి ఎలిమినేషన్ ప్రక్రియలో ఏడుగురు.. మోనాల్, అభిజీత్, అమ్మ రాజశేఖర్, జోర్దార్ సుజాత, లాస్య, నోయల్, అరియానా ఉన్నారు. ముందుగా లీకువీరులు చెప్పినట్లుగానే సుజాతా ఔట్‌ అయింది. ఎలిమినేషన్‌ అనంతరం స్టేజ్‌ పైకి వచ్చిన సుజాతా ఎలిమినేట్ అవుతాన‌నుకోలేద‌ని తెలిపింది. కానీ త‌న‌కు త‌న‌లాగా ఉండే అవ‌కాశం ఇక్క‌డ ల‌భించింద‌ని పేర్కొంది. ఇంటిస‌భ్యులతో ఉన్న అనుబంధాన్ని హార్ట్ ముక్క‌ల ద్వారా చెప్ప‌క‌నే చెప్పింది. అనంత‌రం బిగ్‌బాంబ్‌ను సోహైల్‌పై విసిరింది. వారం రోజులపాటు గిన్నెలు అన్నీ తోమాల‌ని అత‌డిపై బిగ్‌బాంబ్ వేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu