బిగ్‌బాస్-4లో పద్నాలుగో వారంలో ఎలిమినేట్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్. నిత్యం హౌస్‌లో కన్నీళ్లు పెటుకుంటూ.. ‘నర్మద’ అనే పేరు స్థిపరడిపోయింది. బయటకు రాగానే ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీబిజీగా మారింది మోనాల్. ఈ క్రమంలో జోర్దార్ సుజాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. ‘ఓ వీకెండ్లో డీప్ నెక్ డ్రెస్ వేసుకున్నానని ట్రోల్ చేశారని బాధపడింది. ఆరోజు నా ఆరోగ్యం బాగోలేదు. తలకు నూనెతో మేకప్ లేకుండా అలాగే కూర్చున్నాను. కనీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు’ అని అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.
తన సోదరి హేమాలిని ట్రోల్ చేయడంపై కూడా ఆమె స్పందించింది. అభి గురించి చెడుగా మాట్లాడకపోయినా ఆమెను ఇష్టమొచ్చినట్లు నిందించారని మండిపడింది. ‘హేమాలి హౌస్‌లోకి వచ్చినప్పుడు అభిజిత్‌కు ఓ సలహా ఇచ్చింది. నా వెనక కాకుండా నాతో నేరుగా మాట్లాడమని అభికి చెప్పింది. అంతకుముందు కొన్నిసార్లు అతడు నా వెనకాల మాట్లాడాడు కాబట్టే ఆమె అలా చెప్పింది. అందులో ఏ తప్పూ లేదు. ఒకవేళ ఆమె చెప్పే విధానం స్ట్రాంగ్ కావచ్చు. కానీ అభి గురించి చెడుగా ఏం చెప్పలేదు. అయినా సరే అభిజిత్ ఫ్యాన్స్ దారుణంగా ప్రవర్తిస్తూ సోదరిపై నీచంగా కామెంట్లు చేశారు. ఆమెను చంపుతామని బెదిరించారు. దీని వల్ల హేమాలి చాలా బాధ పడింది’ అని తెలిపింది. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది. తన సోదరిని దారుణంగా ట్రోల్ చేసినందుకు అభిజిత్ ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.