బిగ్‌బాస్-4 రెండో వారంలో అడుగుపెట్టింది. మొదటి వారం ఒకరు సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా.. సాయి కుమార్ వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు చర్చంతా మోనాల్‌పై ఇంటిసభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక రేషన్ మేనేజర్‌గా రాజశేఖర్‌కు కెప్టెన్ గా ఎంచుకుంది లాస్య. కాగా రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది ఈ వారం నామినేషన్ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. గంగవ్వ తొలి రౌండ్‌లోనే దిగిపోయింది. నోయల్ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. నాలుగో రౌండ్ సోహైల్, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్‌లో కుమార్, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్‌లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు అనిపిస్తుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో.. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ ఉన్నారు.