HomeTelugu Trendingబిగ్‌బాస్‌లో ఇకపై ఆ నవ్వు వినిపించదా!

బిగ్‌బాస్‌లో ఇకపై ఆ నవ్వు వినిపించదా!

fifth week elimination
తెలుగు బిగ్‌బాస్-4 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం హౌస్‌లో ఫన్నీ టాస్క్‌లు ఉండనున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఇక వీకెండ్‌ కావడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నిన్న సోహైల్‌ సేవ్‌ కాగా అనుకోకుండా.. గంగవ్వ అనారోగ్య కార‌ణాల‌తో ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఆమెను అందరూ సంతోషంగా ఇంటికి పంపించారు. అంతే కాకుండా కొత్త ఇల్లు క‌ట్టిస్తాన‌ని ఆమెకు మాటిచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు నాగార్జున. అవ్వ షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ వారం ఎలిమినేష‌న్ ఉంటుందా? లేదా? అని ప్రేక్షకులు అయోమయంలో ప‌డిపోయారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్‌ అయినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్న దాని ప్ర‌కారం.. ఈరోజు సుజాత ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు చెప్తున్నారు. త‌న న‌వ్వే ఆమె పాలిట శ‌త్రువుగా మారింద‌ని నెటిజ‌న్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్ర‌తిదానికి ఫేక్ న‌వ్వు విసురుతుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అలాగే నాగార్జున‌ను ప‌ట్టుకుని బిట్టూ అంటూ బిస్కెట్లు వేయడాన్ని ఆయ‌న ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. దీంతో సుజాత ఈ వారం బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu