HomeTelugu Trendingబిగ్‌బాస్‌: స్నేహితుల మధ్య వాగ్వాదం

బిగ్‌బాస్‌: స్నేహితుల మధ్య వాగ్వాదం

akhil sohel fight in nomina
తెలుగు బిగ్‌బాస్‌-4లో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకరిపై ఒకరు గుడ్లు వేసుకుని నామినేట్‌ చేసుకున్నారు. హౌస్‌లో అభి, అవినాష్‌ల మధ్య గొడవలు కూడా జరిగాయి. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ ప్ర్రక్రియ ఇంకా పూర్తికాలేదు అంటూ షాకిచ్చాడు బిగ్‌బాస్‌. అభి, అమ్మ, మోనాల్‌, హారికాను నిలబెట్టి వారిని డిస్టర్బ్ చేయమని మిగతా వాళ్లకు చెప్పాడు. వారిని డిస్టర్బ్ చేసే క్రమంలో అమ్మ దగ్గరికి అఖిల్ వెళ్లగానే మెహబూబ్ వచ్చి అడ్డుకున్నాడు. దాంతో మనోడికి కోపం నషాలానికి అంటేసింది. ఎలా ఆడతారో ఆడండ్రా చూసుకుంటా అంటూ అక్కడున్న బుట్టతో పాటు మట్టి కుండను కూడా తన్నేశాడు అఖిల్. దాంతో ఎవడు మొదలు పెట్టాడు ఇది అంటూ సోహెల్ అరుస్తుంటే.. ఎవడు మొదలు పెట్టిండు బే అంటూ అఖిల్ కూడా సీరియస్ అయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. మరి ఈరోజు ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో.. చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu