HomeTelugu Big Storiesతెలుగు 'బిగ్‌బాస్‌-3' విన్నర్‌ రాహుల్‌

తెలుగు ‘బిగ్‌బాస్‌-3’ విన్నర్‌ రాహుల్‌

12
బిగ్‌బాస్-3 రియాల్టీ షో చివరి ఘట్టానికి చేరుకుంది. చివరిగా బాబా మాస్టర్ ఎలిమినేషన్ అనంతరం టాప్‌-2 కంటెస్టెంట్‌ను స్పెషల్ గెస్ట్ కాదు నేనే తీసుకొస్తానంటూ నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌తో నాగార్జున కాసేపు ముచ్చటించారు. హౌస్‌లో వారి జర్నీని చూపించారు. ఇద్దరికీ చెరో రూ. 25 లక్షలు ఆఫర్ ఇచ్చారు. అయినా వారు దాన్ని తిరస్కరించారు. చివరిగా బిగ్‌బాస్ వారితో మాట్లాడారు. మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జర్నీ మీకే కాదు.. బిగ్‌బాస్‌కు కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. ఇక నేటితో ఈ షో ముగిసిందని మీరు బయటకు వెళ్లే ముందు స్విచ్ఛాఫ్ చేసి వెళ్లమంటూ బిగ్‌బాస్ వారికి చెప్పారు. నాగార్జునతో కలిసి బయటకు వచ్చారు.

11

బిగ్‌బాస్ బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి వెల్‌కమ్‌ అంటూ నాగార్జున స్టేజ్‌పైకి ఆహ్వానించారు. డాన్సర్లతో స్టేజ్‌పైకి మెగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంత పెద్ద షోకి నన్ను పిలిచారు అని వచ్చాను.. అయితే ఇంత మంచి వెలకమ్‌ ఉంటుంది అని అనుకోలేదు అని అన్నాడు. ఇక చిరు.. నాగ్‌ ఈ షో విన్నర్‌ ఎవరు అని మీరు అనుకుంటున్నారు అని చిరంజీవి అడిగారు. ఇక కొన్ని సంఘటనలను నెమరువేసుకున్నారు. నాగ్‌ యొక్క డైలాగ్స్‌ అన్నీ డీజే రూపంలో వినిపించమని బిగ్‌బాస్‌ని అడిగారు. డీజే తరువాత ప్రయాణం చూపించవాల్సిందిగా చిరు బిగ్‌బాస్‌ని అడిగాడు.. చూపిస్తారా.. అని చిరంజీవ అనగా.. మీరు బిగ్‌బాస్‌ మీరు అడిగేతే చూపించకుండా అంటారా.. అని నాగ్‌ అన్నారు. ఈ వీడియో అనంతరం పునర్నవి, వరుణ్‌, వితికా.. మా ఊరు అమ్మాయి అని చిరంజీవి అన్నారు. వితికా.. నా జన్మదన్యం అని చెప్పింది. హిమజ, రవి, రోహిణి, జ్యోతి, తమన్నా.. తో మాట్లడాడు. తమన్న ని చిరు పొగడ్తలతో ముంచి ఎత్తేశారు. ఇక బాబా భాస్కర్‌తో మాట్లాడాడు. బాబా చిరు నేను మీకు ఫాన్‌ అని అనగా.. చిరు కూడా.. నేను నీకు పెద్ద ఫ్యాన్‌ అని చిరు చెప్పారు. మీరు బిగ్‌బాస్‌లో చాలా బాగా నటించారు అని.. కదా.. తప్పుగా అన్నానా.. ఓకే చాలా బాగా ఉన్నారు అని అన్నారు. నాకు తెలిసిన బాబా ఇలా ఉండాడు. స్టెప్‌తు రాంగ్‌ వేస్తే.. మీదకు వెల్లిపోతాడు. కానీ ఇక్కడ బాబాలా మారిపోయాడు అన్నారు. చివరిగా శిల్పా, మహేష్‌, జాఫర్‌తో మాట్లాడాడు. జాఫర్‌ తో మాట్లాడాను మళ్లీ కట్రవర్సీ అంటూ.. వెళ్లిపోతన్నాను అని అన్నాడు. నువ్వు ఇంత బాగా అడతావు అని అనుకోలేదు అని అన్నాడు. చివరిగా నాగ్‌.. శ్రీముఖి, రాహుల్‌ని స్టేజ్‌ మీదకు తీసుకువచ్చాడు. వారి చిరంజీవి అభినందించారు. మీలో ఎవరు విన్‌ అయిన ఇద్దరు విన్నర్సే అంటు చిరు తన అభిప్రాయాని వెల్లడించారు. చివరిగా రాహుల్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. శ్రీముఖి కూడా తన అభిప్రాయాని తెలిపింది. నా బ్లెడ్‌లోనే లేదు ఓటమిని ఒప్పుకోవడం.. బాధ ఉంటుంది అన్నాడు.
రాహుల్‌ మా తల్లిదండ్రులకు పుట్టినందుకు గర్వంగా ఉంది అన్నాడు చివరిగా.. చిరు అందిఇంచిన ట్రోపీతో బిగ్‌బాస్‌ బిగ్‌ సెండాఫ్ ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu