వరుణ్ జంట వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షో ఫైనల్‌కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు.
దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఫైనల్ బెర్తు కోసం వరుణ్, రాహుల్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వరుణ్.. రాహుల్‌తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్‌గా టికెట్ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? టాస్క్ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే!
"Ticket To Finale" evaru geluchukuntaru??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/srVrxbrxGn
— STAR MAA (@StarMaa) October 21, 2019