బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారులైన శివజ్యోతి, బాబా, రవి, శ్రీముఖిలకు నాలుగు గిన్నెలు ఇచ్చాడు. భిన్న రంగులు నింపిన ఆ బౌల్స్‌ను వారు కాపాడుకోవల్సి ఉంటుంది. అయితే వాటిని రెండు చేతులతో పట్టుకుని ఉండాలని, కింద పెట్టకూడదని, వేరే వారి చేతుల్లోకి వెళ్లకూడదని, ఒక్కసారి మాత్రమే కలర్‌ను మళ్లీ నింపుకునే అవకాశం ఉంటుందనే నిబంధనలు పెట్టాడు. చివరి వరకు ఎవరి బౌల్‌లో ఎక్కువ రంగు ఉంటుందో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు.
ఈ క్రమంలో బాబా పట్టుకున్న బౌల్‌లో ఉన్న కలర్‌ను పడేసేందుకు అందరూ ప్రయత్నించారు. అయితే బాబా బెడ్‌రూమ్ ఏరియాలోకి వెళ్లి నిల్చున్నాడు. బౌల్‌ను ఖాళీ చేసే ప్రయత్నంలో బెడ్స్‌పై రంగుపడింది. డైనింగ్ టేబుల్‌కింద కూర్చొన్న శివజ్యోతిని డిస్టర్బ్ చేసేందుకు అందరూ ప్రయత్నించారు. అయితే శివజ్యోతి మధ్యలో ఒక్క చేతితోనే బౌల్‌ను పట్టుకున్నందుకు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు.
చివరగా రవి, శ్రీముఖిలు మిగలగా.. రవి చేతిలో ఉన్న కలర్ బౌల్‌ను లాగేయగా.. అది కిందపడిపోయింది. చివరి వరకు రెండు చేతుల్లో బౌల్‌ను పట్టుకుని.. పదో వారంలో శ్రీముఖి ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఎట్టకేలకు కెప్టెన్ కావాలనే కోరిక పదో వారంలో తీరే సరికి శ్రీముఖి ఆనందంలో మునిగిపోయింది. ఇక ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరో చూడాలి. ఇప్పటి వరకు సరిగా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. రవి కృష్ణకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం రవినే ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలి.