బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారంలో ఎలిమినేషన్ నాటకానికి తెరపడింది. తొమ్మిదోవారం నామినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టాలు ఉండగా హిమజ నామినేట్ అయ్యింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్‌ని నామినేట్ చేస్తున్నట్టుగా నాటకం ఆడి చివర్లో ట్విస్ట్ ఇచ్చి రాహుల్‌ని ఫేక్ నామినేట్ అంటూ సీక్రెట్ రూంలో కూర్చోబెట్టారు నాగార్జున.
ఇక మిగిలిన హిమజ, మహేష్ విట్టాలలో హిమజ ఎలిమినేట్ అయినట్టుగా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో గద్దలకొండ గణేష్ ప్రకటించారు. వరుణ్ తేజ్ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు. ఆయనే హిమజ ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు.
అయితే హిమజ తనదైన స్టైల్‌లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి హిమజను పంపించాలని కంకణం కట్టుకున్న పునర్నవి, వితికాల ప్రయత్నాలు ఫలించాయి. ఈవారంలో హిమజ ఎలిమినేట్ అయ్యిందంటే ప్రధాన కారణం వితికానే. ఎలిమినేషన్ తరువాత ‘మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే అవకాశం ఇస్తే వెళ్తావా? అని నాగార్జున అందర్నీ అడిగినట్టే అడగగా.. నేను వెళ్లును సార్.. ఒకసారి ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ వెళ్లడం అనేది ఫెయిర్ కాదు. అది వన్ టైం డ్రీమ్ మాత్రమే అని తెగేసి చెప్పింది హిమజ.