ముందుగా అందరూ ఊహించినట్లే ఈ వారం రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్ కానున్నట్లు ప్రకటించారు. దీంతో రోహిణి సేవ్ అయినందుకు సంతోషపడింది. అయితే ఆ సంతోషం పది నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఈ వారం ప్రారంభంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించినపుడు రోహిణి ఎలిమినేషన్లో లేదు. నామినేషన్ ప్రక్రియ గురించి శివజ్యోతితో రోహిణి గుసగుసలు చెప్పింది. దీంతో నామినేషన్ గురించి చర్చించకూడదన్న నియమాన్నిఉల్లంఘించినందుకు రోహిణిని బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశాడు.
అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారందరిలో రోహిణి కాస్త తక్కువ ఫేమ్ ఉండటం, హౌస్‌లో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేకపోవడం, ఎక్కువగా హైలైట్ కాకపోవడంతో ఓటింగ్‌లో తేడా కొట్టేసింది. దీంతో నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఓ రకంగా రోహిణి నామినేషన్‌కు తానే కారణమని శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది.
మొత్తంగా ఈ వారం బిగ్‌బాస్ షో కాస్త చప్పగానే సాగిందని చెప్పాలి. ఈవారం పెద్దగా టాస్క్‌లు ఏమీ లేవు. హౌస్‌లో పెద్దగా కాంట్రవర్సీలు లేవు. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో సినిమా డైలాగ్ చెప్పించాడు బిగ్‌బాస్. ఆట మధ్యలో సేఫ్ అయిన వారి పేర్లు ప్రకటించాడు. రోహిణి వెళ్లిపోతూ హౌస్‌లో ఉన్న వారిలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తావో వేయాలంటూ ఓ బోర్డుపై మార్కులు వేయించాడు నాగార్జున. హౌస్‌లో అందరికంటే బాబా మాస్టర్‌కు నూటికి వెయ్యి మార్కులు ఇచ్చింది రోహిణి.