HomeTelugu Big Storiesహేమను ఇరికించిన బిగ్‌బాస్‌.. మొదటి టాస్క్‌ ఇదే

హేమను ఇరికించిన బిగ్‌బాస్‌.. మొదటి టాస్క్‌ ఇదే

1 22ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌3 మొదలైపోయింది. పదిహేను మంది సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెట్టారు. చివరగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌ను ప్రశ్నలడిగి బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ను రవికృష్ణ, శివ జ్యోతి, అషూ రెడ్డిలు పూర్తి చేశారు. ఇక మిగిలిన 12 మంది ఇంటిసభ్యుల్లో ఎవరి సమాధానాలు సరైనవి కాదని అనుకుంటున్నారో వారి పేర్లను తెలపమని ఆ ముగ్గురిని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇందుకోసం వారికి కొంత సమయాన్ని కేటాయించాడు. ఆ ముగ్గురు చర్చించుకుని.. రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు. వారు చెప్పిన ఆ ఆరుగురు నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

అయితే నామినేట్‌ అయినట్లు ప్రకటించారు కానీ అవి ఎందుకోసమై ఉండొచ్చని వారంతా చర్చించుకుంటూ ఉన్నారు. గత సీజన్లో జరిగిన సంఘటనలను గుర్తుకు చేసుకున్నారు. నామినేషన్స్‌ అంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసమేనని ముచ్చటించుకున్నారు. మర్నాడు ఉదయం వేళకు బాబా భాస్కర్‌, జాఫర్‌లు కాస్త ఫన్‌ క్రియేట్‌చేశారు. బాబా భాస్కర్‌ ఆధ్వర్యంలో జాఫర్‌ చేసిన వ్యాయామం నవ్వులు తెప్పించాయి. పదిగంటలకు బిగ్‌బాస్‌ ఓ పాటను ప్లే చేయగా.. ఇంటి సభ్యులు డ్యాన్సులు చేశారు. అనంతరం ఇంటి అవసరాలకు సరిపోయే సరుకులను బిగ్‌బాస్‌ పంపించాడు. సాయంత్రానికి కొంతమంది హౌస్‌మేట్స్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు.

1a 2

మొదటిరోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌
ఆరుగురు నామినేషన్‌ ప్రక్రియలో ఉండగా.. అందులోంచి తప్పించుకునే అవకాశాన్ని కూడా కల్పించాడు. అయితే అందుకోసం.. వారంతా కలిసి ఓ మానిటర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఆ ఆరుగురు చర్చించుకుని హేమను మానిటర్‌గా ఎన్నుకున్నారు. అయితే ఈ వ్యవహారం మానిటర్‌ మెడకు చిక్కుకునేలా ఉంది. నామినేట్‌ అయిన ఒక సభ్యుడు మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒకరిని తనకు బదులుగా.. సరైన కారణాలను చెప్పి రీప్లేస్‌ చేయవచ్చునని బిగ్‌బాస్‌ తెలిపాడు. అయితే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం మానిటర్‌దేనని బిగ్‌బాస్‌ క్లియర్‌గా చెప్పేశాడు. ఐదుసార్లు ఓ బెల్‌ మోగుతుందని.. మోగిన ప్రతిసారి ఆరుగురిల్లోంచి ఒకరు.. మిగిలిన హౌస్‌మేట్స్‌లోంచి ఒకర్ని ఎన్నుకుని సరైన కారణాలు చెప్పి నామినేట్‌ చేయవచ్చని తెలిపాడు. అవతలి వ్యక్తి కూడా తాను చెప్పదలుచుకున్నది తెలియజేయవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. అయితే తుది నిర్ణయం మాత్రం మానేటర్‌దేనని స్పష్టం చేశాడు.

హౌస్‌లో మొదటి రోజు ప్రశాంతంగా గడుస్తుందని అనుకున్న హౌస్‌మేట్స్‌కు నిరాశే ఎదురైంది. పరిచయమైన కొద్ది సమయానికే వారిమధ్య గొడవలు పెట్టే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి ఈ ఆరుగురిలో నామినేషన్‌ నుంచి ఎవరు తప్పించుకుంటారు? ఇంకెవరు కొత్తగా నామినేషన్‌ ప్రక్రియలో జాయిన్‌ అవుతారు? ఇందుకోసం ఇంటిసభ్యుల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తాయి? ఈ టాస్క్‌లో హేమకు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అన్నది తెలియాలంటే మంగళవారం (జూన్‌ 23) ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu