బిగ్‌బాస్ పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్ మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీముఖి తాను ఒంటరినని ఫీల్ అవుతూ టాస్కులకు దూరంగా ఉంటోంది. అటు పునర్నవి రవికృష్ణపై వీరలెవల్లో సీరియస్ కావడం గమనార్హం. వాడో పెద్ద వెధవ అంటూ తిట్టిపోసింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ గుర్రుగా ఉండటంతో బిగ్ బాస్ వారందరికి ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అత్యుత్తమ పెర్ఫార్మన్స్ ఇచ్చినవారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులని ప్రకటించాడు.
ఇక ఈ టాస్క్ మొదట సరదాగా సాగినా.. మధ్యకు వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య వైరం మొదలైంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వరుణ్ సందేశ్- రాహుల్ సిప్లిగంజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటికి పని చెప్పాడు. ఇక వీరిద్దరిని ఆపడానికి వితిక బాగా ప్రయత్నించింది.