HomeTelugu Trendingబిగ్‌బాస్‌లో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా!

బిగ్‌బాస్‌లో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా!

7 21తెలుగు అతిపెద్ద రియాల్టీ ‘బిగ్‌బాస్‌ -3’ షోలో ఆసక్తికరంగా ఉండే అంశమైన ఎలిమినేషన్‌ పార్ట్‌, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల గురించి సోషల్‌ మీడియాలో ముందే లీకైపోతోంది. మొదటి వారంలో హేమ ఎలిమినేట్‌ అవుతుంది.. తమన్నా సింహాద్రి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా రాబోతోందని లీకులు హల్‌చల్‌ చేశాయి. అయితే ఆ రూమర్సే నిజమయ్యాయి. ఇక ప్రతీ వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒక్క రోజు ముందే బయటకు వచ్చేస్తోంది. బిగ్‌బాస్‌ షోకి సంబంధించి లీకవ్వడమే షరా మామూలైంది. జాఫర్‌, తమన్నా, రోహిణిల ఎలిమినేషన్‌ విషయంలో కూడా ఇదే నిజమైంది. రిజల్ట్‌ శనివారం సాయంత్రం కల్లా తెలిసిపోయింది.

బిగ్‌బాస్‌లో ఐదో వారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తవబోతోంది. వీకెండ్‌లో నాగ్‌ వచ్చేస్తాడు. హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తాడు. ఐదో వారంలో ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ను అధికారికంగా నాగ్‌ ప్రకటించకముందే.. సోషల్‌ మీడియాలో చాటింపేస్తున్నారు. దీంతో ఎలిమినేషన్‌పై ఉండే ఉత్కంఠ సన్నగిల్లుతోంది. ఈ వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది అషూ రెడ్డి అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మరి ఈ రూమర్‌ కూడా నిజమవుతుందా? లేదా అన్నది తెలియాలి. ఈ వీకెండ్‌కు సంబంధించి మరో వార్త కూడా హల్‌ చల్‌ చేస్తోంది. హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందని.. ఈషారెబ్బా, హెబ్బా పటేల్‌, శ్రద్దా దాస్‌, కేఏ పాల్‌ అంటూ కొన్ని పేర్లను జతచేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి వీటిలో నిజమెంత ఉందో తెలియాలంటే బిగ్‌బాస్‌ అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాలి?

Recent Articles English

Gallery

Recent Articles Telugu