బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హౌస్‌మేట్స్‌లో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో ఎవరికీ తెలియదు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ భయం.. ఆదివారం ఎలిమినేషన్ భయం. అయితే ఎలిమినేషన్‌లో ఉంటే.. కంటెస్టెంట్లకు రెండు విషయాలు తెలిసొస్తాయి. వారు ఎంత బలమైన కంటెస్టెంట్లన్న విషయం ఎలిమినేషన్ ప్రక్రియ చాటిచెబుతుంది. నామినేట్ అవుతూ.. ఎలిమినేట్ కాకుండా ఉంటే వారికి ఫాలోయింగ్ పెరుగుతూ ఉన్నట్లు లెక్క. ఇక నామినేషన్స్‌లోకి రాకుండా సేఫ్‌గేమ్ ఆడుతూ ఉంటే.. వారికి వాస్తవం బోధపడదు. బయట ఏం జరుగుతుందో? తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో? ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అన్న విషయం తెలీదు.
ఒక్కసారి కూడా నామినేషన్ ఫేస్ చేయకుండా ఉంటే.. అతడ్ని బలమైన కంటెస్టెంట్ అని చెప్పలేము. ప్రతీవారం నామినేట్ అయినా.. సేవ్ అవుతూ వచ్చేవారినే స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా భావిస్తాము. అయితే ఇంతవరకు ఆరువారాలు గడవగా.. ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. దీంట్లో భాగంగా హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ ఇంటిని వీడిపోయారు. అయితే వీటన్నంటిలో ఏ ఒక్కసారి అలీరెజా నామినేషన్స్‌ను ఫేస్ చేయలేదు.
ఇదే కారణంతో.. అలీరెజాను స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అందరూ పరిగణించి ఏడో వారంలో నామినేట్ చేశారు. అయితే మొదటిసారి ఎలిమినేషన్‌లోకి వచ్చిన అలీ.. ఇంటిముఖం పట్టినట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. అలీరెజా ఎలిమినేట్ అయినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొదటి సీజన్లో.. కూడా ఇలాగే ప్రిన్స్ మొదటిసారి నామినేషన్ జోన్‌లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. రెండో సీజన్‌లో దాదాపు ప్రతీవారం నామినేట్ అవుతూ.. అంతకంతకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ విన్నర్‌గా నిలిచాడు కౌశల్. అయితే అలీరెజా ఒక్కసారి నామినేషన్ ఫేస్ చేసి.. ఎలిమినేట్ అయిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాస్క్‌లు బాగానే ఆడుతున్నా.. తనకున్న టెంపర్, అగ్రెసివ్‌నెస్ మూలానే ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఎలిమినేట్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. మరి నిజంగానే అలీ ఎలిమినేట్ అయ్యాడా? అన్నది అధికారికంగా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.