తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 హాట్ హాట్‌గా సాగిపోతోంది. మొదటి వారం పూర్తయ్యాక ఎలిమినేషన్‌లో భాగంగా హేమ బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోయాక.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. మల్లెపూల గుబాళింపుతో వయ్యారాలు ఒలకబోస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి.
ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. తమన్నాకు వెల్‌కమ్ చెబుతూ ఇంట్లోని సభ్యులందరినీ శ్రీముఖి పరిచయం చేసింది. తాను బాబా భాస్కర్, జాఫర్ టీంతో ఉంటానని చెప్పింది తమన్నా. హౌస్‌లో వరుణ్ సందేశ్ ప్రవర్తన తనకు నచ్చలేదని.. మహేష్ విట్టాతో వరుణ్, వితికాలు వ్యవహరించిన తీరు సరికాదని చెప్పింది.
ఈవారం ఎలిమినేషన్ రౌండ్‌లో బిగ్‌బాస్ ఒక్కొక్కరిని పిలిచి ఇద్దరి పేర్లు చెప్పమనగా అందరూ రెండేసి పేర్లు చెప్పి దానికి కారణాలు చెప్పారు. చివరిగా బాబా భాస్కర్ మాత్రం తాను ఎవరినీ ఎలిమినేట్ చేయలేనని చెప్పాడు. హౌస్‌కి వచ్చి వారమే అయ్యింది. ఏదో ఒక కారణంతో ఇద్దర్ని నామినేట్ చేయమంటే నేను చేయలేను. నన్ను నామినేట్ చేయండి బిగ్‌బాస్ అని చెప్పాడు. మీకు ఇప్పటికే బిగ్‌బాస్ చాలా సమయం ఇచ్చారు. మీరు ఇద్దరిని నామినేట్ చేయకుంటే మొత్తం సభ్యులంతా నామినేట్ అవుతారని చెప్పడంతో మిగతా సభ్యులతో చర్చించాక బిగ్‌బాస్‌కి రిక్వెస్ట్ పెట్టి నామినేషన్ కోసం ఇద్దరి పేర్లు(వితిక, రాహుల్) వెల్లడించాడు బాబా భాస్కర్. ఇక నామినేషన్ ప్రారంభమైన తరువాత ఎవరితోనూ చర్చించకూడదనే నిబంధనను పాటించని కారణంగా వరుణ్ సందేశ్ భార్య వితికా.. నామినేషన్ చేయడానికి అనర్హురాలైంది. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నాను నామినేట్ చేయడానికి వీలులేదని సభ్యులందరికీ బిగ్ బాస్ చెప్పాడు. ఈవారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ ఉన్నారు. ఒకేసారి 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఎక్కువమంది నామినేట్ చేసిన వారిలో శ్రీముఖి, హిమజ ముందున్నారు.