తెలుగు బిగ్‌బాస్-3 ఈ సీజన్ ప్రారంభం కాకముందే షోపై కాంట్రవర్సీ చెలరేగింది. తమను బిగ్‌బాస్‌లో సెలెక్ట్‌చేసి తర్వాత షో ప్రారంభానికి ముందు తొలగించారని.. ఆర్థికంగా నష్టపోయామంటూ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ను సూపర్ హిట్ చేసేందుకు హోస్ట్‌గా కింగ్ నాగార్జునను ఎంపిక చేశారు.
15 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపించారు నాగార్జున. ఆ తర్వాత రెండో రోజు నుంచే హౌస్‌లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 5 రోజుల షో తర్వాత ఆరో రోజు శనివారం సభ్యులను కలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో ఎవరు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారో తెలిపారు. మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్‌ను పలకరించిన నాగార్జున ఒక పిల్లోను ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తూ ఎవరి వద్ద ఆగితే వారితో మాట్లాడుతూ వాళ్లు ఈ ఐదు రోజుల్లో చేసిన అల్లరి, వాళ్ల యొక్క పెర్ఫార్మెన్స్ గురించి వివరించాడు. వాళ్లలోని తప్పులను ఎత్తిచూపకుండా సభ్యులు చేసిన పాజిటివ్ అంశాలపైనే చర్చించారు. అందరితో సరదాగా మాట్లాడుతూ నవ్వించారు.
పునర్నవి చాలా మెచ్యుర్డ్‌గా ఆలోచిస్తుందని, శ్రీముఖి అందరితో బాగా కలిసిపోతుందని, వరుణ్-వితిక రోమాన్స్, బాబా భాస్కర్-జాఫర్ బ్రొమాన్స్ అంటూ.. రవికృష్ణ బాగా డిసప్పాయింట్ చేశాడని, హేమ డామినేషన్ చేసిందని అన్నారు.
శివజ్యోతి తన ప్రేమ కథను చెప్పి హౌస్‌మేట్స్‌తో పాటు, ఆడియెన్స్‌ను కంటనీరు పెట్టించింది. పందొమ్మిదేళ్లకే ఇంట్లోంచి బయటకు వచ్చేయడం.. ప్రేమ వ్యవహారం గొడవలు.. భర్త కష్టపడి పోషించడం.. కుటుంబ పరిస్థితులు గురించి చెబుతూ కన్నీరు పెట్టించింది. చివరకు తాను ఉద్యోగం చేసుకుంటూ తన భర్తను చదివించానని తెలిపింది. తన తండ్రి చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదని.. తనకు తండ్రి ప్రేమ తెలియదని.. అయితే చివరి రోజుల్లో తన వద్దే ఉన్నాడని చెప్పుకొచ్చింది.
మహేష్ విషయంలో రవికృష్ణ అన్న మాటలు కరెక్ట్ కాదని, బిగ్‌బాస్ హౌస్‌లో జాతి, రంగు,కులం, మతం, ప్రాంతం అంటూ ఉండవని, ఇక్కడే కాదు ఎక్కడా ఉండకూడదని నాగార్జున అన్నారు. రవికృష్ణకు నల్లరంగు పూసే.. అవకాశం ఇచ్చినా మహేష్ మాత్రమ వద్దన్నాడు. రవికృష, మహేష్ హగ్ చేసుకోవాలని, కలిసుండాలని చెప్పగానే ఇద్దరూ హగ్ చేసుకుని ముద్దులు కూడా పెట్టుకున్నారు.
పునర్నవితో మాట్లాడుతూ నీవు అందరికీ హెల్ప్ చేస్తున్నావని, చిన్న పిల్లల టాస్క్‌లో మహేష్‌కు సర్దిచెప్పడం, టాస్క్‌లో పాల్గొనేందుకు ఒప్పించడం బాగుందని మెచ్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యురిటీ ఎలా వచ్చిందంటూ పొగిడారు నాగార్జున. ఇక ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయిన చపాతి ఇష్యూను గుర్తు చేశాడు. అసలు ఆ చపాతి గొడవేంటని ఇంటిసభ్యులను అడిగారు. బాబా భాస్కర్ తన చపాతిని తీసుకున్నాడని తెలిసినా కూల్‌గా రియాక్ట్ అయ్యావని అన్నారు.. చివరకు ఓ చపాతిని బిగ్‌బాస్ పంపించగా.. బాబా భాస్కర్ చేతుల మీదుగా పునర్నవికి ఇప్పించాడు.
హిమజతో మాట్లాడుతూ హౌస్‌లో కన్నీళ్లు పెట్టిన మొట్ట మొదటి కంటెస్టెంట్ నువ్వే అని, ఎందుకు కన్నీళ్లు పెట్టావంటూ ప్రశ్నించారు. తాను మొదట్నుంచీ సెన్సిటివ్ అని, తన వలన మహేష్‌కు గాయమైందనే బాధలో ఉండగా హేమ ఏదో అనడంతో ఏడుపు వచ్చేసిందని తెలిపింది.
శ్రీముఖితో మాట్లాడుతూ ఇంట్లో అందరితో బాగా కలిసిపోతున్నావని మెచ్చుకున్నాడు. శ్రీముఖికి అలకానంద అనే పేరు పెడుతున్నానని నాగార్జున అన్నారు. అయితే అక్కడిదిక్కడ.. ఇక్కడిదక్కడ చెప్పకుండా, జాగ్రత్తగా ఉండమని సూచించాడు. ఇద్దరి మధ్య వచ్చిన గొడవలను పరిష్కరించడానికే అలా చేస్తున్నానని, కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపింది.
ఈరోజు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన వారిలో తొలి కంటెస్టెంట్ హిమజ అని చెప్పగానే ఎప్పటిలాగానే తాను ఎమోషన్ ఫీలయింది. ఆమెకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక మిగిలిన ఐదుగురిలో పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిపారు. అంతే కాకుండా పునర్నవిని పండు అని సంబోధించాడు నాగార్జున. తన పేరు పండు అని హౌస్‌లోని అందరికీ చెప్పాడు. ఇంకా రాహుల్, వితికా, జాఫర్, హేమలు ఎలిమినేషన్‌లో ఉండిపోయారు. సో.. ఈ నలుగురిలో ఎలిమినేట్ అయ్యేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే నంటూ నాగార్జున ఈ ఎపిసోడ్‌ను ఇక్కడితో ముగించారు.