ఈ రోజు బిగ్‌బాస్-3 తెలుగు 38వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ వారం ఎలిమినేట్ అయిన సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఆరుగురిలో ముగ్గురిని ఎంచుకోమన్నాడు. అందులో భాగంగా రవి, రాహుల్, వరుణ్‌లు ఎంపికయ్యారు. వారికి ఒక్కొక్కరికి 2 టాస్క్‌లు ఇచ్చాడు. ముందుగా రవి.. ఒకరిపై షేవింగ్ ఫోం రాయాలి. రెండవది ఒకరి బెడ్ తడపాలి. ఇక రాహుల్ కి వితిక, వరుణ్‌ల లవ్ సింబల్ దిండు చింపాలి అన్నాడు. ఇక అలీ డోర్ దగ్గర నుంచుని రాహుల్‌ని ఇంటిలోకి రానివ్వకుండా.. డోర్ దగ్గర అడ్డుపెట్టాడు. వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. మధ్యలో జ్యోతి వచ్చి రాహుల్ నువ్వు జారకు అని చెప్పింది. దానికి రాహుల్ నువ్వు నోరు మూసికొని సక్కగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పాడు. జ్యోతి ఈ విషయంపై నువ్వు ఎవరు నన్ను నోరుమూసుకుని పో అనడానికి అని రాహుల్‌పై కోప్పడింది. ఆ తర్వాత వంతు వరుణ్‌కి వచ్చింది. టాస్క్‌లో భాగంలో వితిక మొహంపై కాఫీ కొట్టాడు.. రెండోది వితిక డ్రెస్ కట్ చేశాడు.
టాస్క్ పూర్తి కావడంతో రవి, రాహుల్, వరుణ్‌లు ఆ టాస్క్‌లు విజయవంతంగా పూర్తి చేశారని.. ఈ ముగ్గురు ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈవారం పునర్నవి, హిమజ, మహేష్‌లు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక రాహుల్ ఇదంతా టాస్క్‌లో భాగమేనని జ్యోతి, శ్రీముఖిలకు వివరించాడు.