తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో.. బిగ్ బాస్ సీజన్-3 ఇప్పటి వరకు 27 ఎపిసోడ్‌ల పూర్తయ్యాయి. నేడు(ఆగస్ట్ 17) 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు సేఫ్ అవుతారనే ఆసక్తితో ఇవాళ్టి ఎపిసోడ్ మొదలైంది. కింగ్ నాగార్జున సూట్‌లో మోడల్స్‌తో స్టెప్పులేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్‌కి బాబా భాస్కర్ నలుగురు బిగ్ బాస్ బ్యూటీస్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఫేస్‌కి నల్లటి క్రీమ్ పూసుకుని ట్రోలర్స్ కు మంచి ఛాన్స్ ఇచ్చాడు మహేష్ . ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అని మహేష్ అంటే.. నేను చదివింది ఎనిమిదే.. నువ్ ఏం చదివావ్ అని బాబా భాస్కర్ అడిగారు. దీనికి మహేష్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. మరి అంత చదువుకుని ఇక్కడకు ఎందుకు వచ్చావ్.. అయినా నువ్ అంత చదువుకుంటే.. నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోయావ్ అని పంచ్ పేల్చారు బాబా భాస్కర్. కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు మహేష్.
ఇక హాల్లో సోఫాలో అటు ఇటుగా పడుకుని రాహుల్, పునర్నవి రొమాంటిక్‌గా కబుర్లు చెప్పుకుంటున్నారు. సడెన్‌గా రాహుల్ లేచి.. మనం ఇలా పడుకుని ఉంటే.. ఈజీగా మనల్ని ట్రోల్ చేస్తారు అన్నాడు. నేను అక్కడ పడుకుని ఉంటే నువ్వే పిలిచావ్ అంటూ పునర్నవి సీరియస్ అయ్యింది. ఇక మధ్యలో వచ్చిన వితికా.. రా టీ పెట్టు అంటూ పునర్నవిని ఎత్తుకునే ప్రయత్నం చేసి కింద పడేసింది. నన్ను ఎత్తుకుంటే బావుంది అని అనడంతో రాహుల్ వచ్చి పునర్నవిని ఎత్తుకో అని వితికా అంది. నేను అలా ఎత్తుకుంటే ఇంట్లో వాళ్లు చూసి మామూలుగా మాట్లాడరు అన్నాడు. తర్వాత కిచెన్ టీంలో ఉన్న పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో కల్పించుకున్న వరుణ్.. వితికాకు సర్దిచెప్పి ఓ హగ్ ఇచ్చి కూల్ చేశాడు.
బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్‌కు రకరకాల అవార్డులు ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లో వారి తీరును బట్టి అవార్డులు ఇచ్చాడు. నాలుగో వారం ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. అందులో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు. మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌కు ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సీరియల్ ఆర్టిస్ట్ రోహిణి అనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.