HomeTelugu Big Storiesబిగ్ బాస్ విజేత గీతా మాధురేనట.. టాప్ 3లో లేని కౌశల్‌?

బిగ్ బాస్ విజేత గీతా మాధురేనట.. టాప్ 3లో లేని కౌశల్‌?

8b 3టాలీవుడ్‌ లో ఇప్పడు బిగ్ బాస్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రియాలిటీ షో గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుండటంతో విజేత ఎవరు అనే ఉత్కంఠతో బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలేలో కౌశల్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్‌లు ఉండటంతో ఫైనల్ పోటీ ఆసక్తిగా మారింది. ఇదిలాఉంటే. బిగ్‌బాస్‌-2 విన్నర్ గీతా మాధురే అని జోస్యం చెబుతున్నారు సీజన్ 1 ఫైనలిస్ట్ అర్చన. ఫైనల్‌కి చేరుకున్న ఐదుగురు గెలుపే ధ్యేయంగా ఆడుతున్నా.. విజయావకాశాలు గీతా మాధురికి ఎక్కువగా ఉన్నాయంటూ జోస్యం చెప్పింది అర్చన. ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2 బాగా ఫాలో అవుతున్నాను. ఒక్కో ఎపిసోడ్ మిస్ అయినా శని, ఆదివారాలు వచ్చే సరికి వారంలో బ్యాలెన్స్ ఉన్న ఎపిసోడ్‌లు అన్నీ కంప్లీట్ చేస్తున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు ఏంటి అనే విషయం పై నాకు పూర్తి అవగాహన ఉంది అన్నారు.

8a 7

సీజన్ 1తో పోల్చుకుంటే సీజన్ 2లో చాలా తేడా ఉంది. మేం చాలా ఎంజాయ్ చేశాం. ఒక ఫ్యామిలీలా ఉన్నాం. మేం బిగ్ బాస్ హౌస్‌లో 70 రోజులు మాత్రమే ఉన్నాం. కాని ఇప్పుడు 100 ఎపిసోడ్‌లు క్రాస్ అయ్యింది. అయితే సీజన్-1తో సీజన్-2ని పోల్చడం కరెక్ట్ కాదు. దేని ఫ్లేవర్ దానికే ఉంది. ఇక తారక్‌తో నానిని పోల్చడం కూడా కరెక్ట్ కాదు. నాని చాలా పర్ఫెక్ట్‌గా డీల్ చేస్తున్నారు. అయితే కంటెస్టెంట్స్ ఆధారంగానే హోస్ట్ కూడా ఆధారపడి ఉంది. నా అంచనా ప్రకారం గీతా మాధురి మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే టాప్ 1లో ఉంటుంది. ఆమె ఈ సీజన్‌కి విజేత అవుతుంది. ఒక అమ్మాయిగా సాటి అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. గీతా మాధురి ఫస్ట్‌నుంచి ఎంతో జన్యూన్‌గా ఉంటూ.. తనేంటో తను క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

8 29

ఫినాలేకు చేరిన ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్‌లో గీతా మాధురికి ఫస్ట్ ప్లేస్ ఇస్తా అని.. రెండో స్థానంలో తనీష్, మూడో స్థానంలో సామ్రాట్ ఉంటారన్నారు. తనీష్ పర్సనల్ లైఫ్ అందరికీ తెలుసు ఈ మధ్యనే తండ్రిని కోల్పోయారు అయితే అతనెప్పుడూ సింపతీ కోసం ప్రయత్నించలేదన్నారు. తనీష్ చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నారు. అందరికంటే చాలా చిన్నవాడు కూడా అందుకే ఆయన్ని అభినందించాల్సిందే. ఇక సామ్రాట్.. చాలా సెన్సిటివ్‌గా ఉంటాడు. ఎవర్నీ పొరపాటున కూడా ఓ మాట అనడు. కౌశల్‌కి అనుకూలంగా మిగిలిన కంటెస్టెంట్స్‌కి వ్యతిరేకంగా చాలా ట్రోలింగ్స్, మీమ్స్ వస్తున్నాయి అవి చాలా తప్పు. అమ్మాయిలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని గౌరవించాలి. ఒక అమ్మాయి చేసింది తప్పు కానీయండి ఒప్పు కానీయండి కించపరిస్తే.. నేను సహించలేను. దయచేసి అలాంటి ట్రోలింగ్ చేయొద్దు. వాళ్ల ఫ్యామిలీలను గురించి ఆలోచించండి. మీకు నచ్చిన వాళ్ల గురించి పాజిటివ్‌గా మాట్లాడుకోండి తప్పులేదు. ఎదుటి వారి క్యారెక్టర్‌పై బురద చల్లేలా ట్రోలింగ్స్ చేయొద్దు అంటూ ఇన్ డైరెక్ట్‌గా కౌశల్ ఆర్మీకి చురకలు అంటించింది అర్చన.

Recent Articles English

Gallery

Recent Articles Telugu