ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఓ సీనియర్ లీడర్, మరో ఎమ్మెల్సీ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒక్క టీడీపీ నుంచే కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా పలువురు నేతలు కమలం గూటికి చేరుతున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 10 మంది నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో వారంతా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వారంతా పార్టీలో చేరబోతున్నారు.