HomeTelugu News'బిగ్‌బాస్-3' కంటెస్టెంట్స్‌గా బిగ్‌ సెలబ్రిటీస్‌..!

‘బిగ్‌బాస్-3’ కంటెస్టెంట్స్‌గా బిగ్‌ సెలబ్రిటీస్‌..!

2 8ఒకప్పుడు వినోదం అంటే సిల్వర్ స్క్రీన్‌ మాత్రమే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో బుల్లితెర విజృంభిస్తోంది. టీవీ కూడా ఇప్పుడు బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా అయిపోతుంది. బుల్లితెరలో బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైందట. బిగ్‌బాస్‌.. విదేశాల్లో మొదలై.. హిందీలో ప్రవేశించి.. తెలుగుకి కూడా సోకిన మోడ్రన్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాలు, సీరియల్స్, సింగింగ్, డాన్సింగ్‌ షోలు, ఇవేమీ కాక బిగ్‌బాస్ పూర్తిగా డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్. అందుకే జనం మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్‌-1ను సెన్సేషనల్ హిట్ చేశారు. అదేసమయంలో సెకండ్ సీజన్ పూర్తిగా వర్కవుట్ అయిందని చెప్పలేం కానీ, ఎన్టీఆర్ చేసిన సీజన్‌-1 కంటే నాని చేసిన బిగ్‌బాస్-2 అంతగా మెప్పించలేదని చెప్పొచ్చు.

ముచ్చటగా బిగ్‌బాస్ మూడో సీజన్‌ 2019లో ప్రారంభం కానుందట. బిగ్‌బాస్ కేవలం హోస్ట్ విషయంలోనే కాదు. కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సీజన్‌-2లో పెద్ద సెలబ్రిటీలు పెద్దగా కనిపించకే అంతగా హిట్ కాలేదని ప్రచారం జరిగింది. అందుకే ఈసారి బిగ్‌బాస్ హౌస్ పెద్ద సెలబ్రిటీలతో నింపేయాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికైతే లిస్ట్‌లో రేణుదేశాయ్, గద్దె సింధూర, శోభిత ధూళిపాళ్ళ, వరుణ్‌సందేశ్, ఉదయ్‌భాను, రఘుమాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ల్ లోని పొట్టి నరేష్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్‌ నందన్, కమల్‌ కామరాజ్, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ మహాతల్లి ఫేం జాహ్నవి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా బిగ్‌బాస్‌-3లో ఉంటారా అంటే చెప్పలేం. ప్రచారంలో ఉన్న వారి పేర్లే కాకుండా వేరేవారు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu