బిగ్‌బాస్-4 గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరిగింది. 16 మందితో ప్రారంభమైన ఈ షోలో అభిజిత్ టాప్-5 నుంచి టాప్-1కి వచ్చాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. ముందునుంచీ సోషల్ మీడియాలో వైరల్ అవతున్నట్లుగానే అభిజిత్ ఈసీజన్ విన్నర్ అయ్యాడు. అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.