అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ వంటి తారలు మిగతా భాషల కంటే తెలుగులోనే ఎక్కువగా నటిస్తుంటారు. వారి ప్రయారిటీ కూడా మొదట తెలుగు చిత్రసీమకే. ఇక నయనతార, హన్సిక వంటి తారలు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. ఈ కథానాయికలు ఇతర భాషల్లో నటించినప్పటికీ తమకు ఎక్కువ సక్సెస్ లను ఇచ్చిన ఇండస్ట్రీనే ఎక్కువగా గౌరవించారు. కాజల్, అనుష్క, నయన్ లాంటి వాళ్ళు బాలీవుడ్ అవకాశాలు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లుగానే వ్యవహరించారు కానీ పెద్దగా ఆ వైపు ఆసక్తి చూపలేదు.
అయితే శృతిహాసన్ మాత్రం మొదటి నుండి బాలీవుడ్ మీదే మోజు పడింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా.. కాదని బాలీవుడ్ లో ఓ చిన్న హీరోతో తన మొదటి సినిమాలో నటించింది. కానీ ఆమెకు సక్సెస్ వచ్చింది మాత్రం తెలుగులో వచ్చిన ‘గబ్బర్ సింగ్’తో.. ఆ తరువాత రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా ఘన విజయాలు ఆమెను వరించాయి. అప్పటికీ ఇంకా ఆమెకు బాలీవుడ్ పై మోజు తగ్గలేదు. దాని కారణంగా సౌత్ లో వచ్చిన చాలా అవకాశాలు వదులుకుంది. ఆమెకు తీరిక దొరికినప్పుడు అంగీకరించిన సినిమాలు కాస్త ఫ్లాపయ్యాయి. దీంతో ఇటు సౌత్ లో స్టార్ డమ్ ను పోగొట్టుకొని హిందీలో కూడా పేరు తెచ్చుకోలేక ఎటు అవకాశాలు లేకుండా ఖాళీగా మిగిలిపోయింది. మరి ఇకనైనా.. అమ్మడు తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందేమో.. చూడాలి!