బాలీవుడ్ నటి కంగన రనౌత్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ అని వ్యాఖ్యానించారు. ఆయనకు ఇంజెక్ట్ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి బైడెన్ ఉండరని అన్నారు. మొత్తం షోను నడిపించబోయేది కమల హ్యారిస్ అని చెప్పారు. ఒక మహిళ ఎదిగినప్పుడు… ఇతర మహిళలకు కూడా ఆమె మార్గాన్ని చూపిస్తుందని కమలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల మాట్లాడుతూ… తాను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు… కానీ, చివరి మహిళను మాత్రం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను కంగన స్వాగతించారు.
Not sure about Gajni Biden who’s data crashes every 5 minutes, all the medicines they have injected in to him he won’t last more than a year, clearly Kamal Harris will run the show.
When one woman rises, she makes the way for every woman.
Cheers to this historic day 👏👏👏 https://t.co/hpcy0YksRz— Kangana Ranaut (@KanganaTeam) November 8, 2020