ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

2016లో సినిమాగా విడుదలైన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఈ సినిమా సీక్వెల్స్‌ ‘బిచ్చగాడు 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. విజయ్ ఆంటోని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘బిచ్చగాడు 2’తో మరోసారి విజయ్‌ తన మార్క్ చూపించేటట్లు కనిపిస్తున్నారు. ‘యాంటీ బికిలి’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

సంగీత దర్శకుడి నుంచి యాక్టర్‌గా మారిన విజయ్ ఆంటోని తీసిన సినిమాలన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. ఈ చిత్రానికి ఆయనే హీరో, డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్. కథా రచనలోనూ ఆయన భాగమయ్యారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా.. మే 19కి వాయిదా పడింది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu