మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా షూటింగ్ ఈ రోజునే లాంఛనంగా మొదలుపెట్టారు. చక్రవర్తి రామచంద్ర – శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మమ్ముట్టి మాట్లాడుతూ .. ” ఇది కేరళ నేపథ్యంలో సాగే కథ .. చీకటి యుగాలకి సంబంధించిన కథ. ఈ తరహా కథను .. పాత్రను నేను ఇంతవరకూ చేయలేదు . దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ఇది ఒక ప్రయోగం అవుతుంది” అని అన్నారు.
“ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన నటీనటులు .. సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాను చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని నాకు అనిపించింది. నా కెరియర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని బలంగా నమ్ముతున్నాను. వచ్చే ఏడాదిలో ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడం జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు.