మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. . ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు.ఈ ట్రైలర్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని అర్ధం అయిపోయింది. మెగాస్టార్ తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. కామెడీ, ఎమోషన్స్, తమన్నా, కీర్తి సురేష్ లపై కూడా మంచి సీక్వెన్స్ లు చూపించారు. ఓవరాల్ గా మెగా ఎంటర్టైనర్ తో మెగాస్టార్ మరోసారి రాబోతున్నారు అని చెప్పాలి.
ఇక ఈ ట్రైలర్ లో మహతి సాగర్ స్కోర్ బాగుంది. ఇక ఫైనల్ బిట్ లో చిరు పవర్ స్టార్ ని ఇమిటేట్ చెయ్యడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఎనర్జీ లెవల్స్ ని అలాగే తనలోని కామిక్ స్టైల్ ని భోళా శంకర్ లో చూపించబోతున్నాడని ట్రైలర్ తో కన్ఫర్మ్ అయ్యింది. మరి వెండితెరపై ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తోంది చూడాలి.