HomeTelugu Trendingమిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటున్న చిరంజీవి

మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటున్న చిరంజీవి

Bhola shanker third song pr
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ రూపొందించిన ‘భోళాశంకర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో, చిరంజీవి సరసన తమన్నా నటిస్తోంది.

ఈచిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఒక్కో అప్ డేట్‌ను వదులుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా మరో సాంగ్‌ను రేపు విడుదల చేయబోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ‘మిల్కీ బ్యూటీ .. నువ్వే నా స్వీటీ’ అంటూ సాగే ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరపరిచారు. చిరంజీవి, తమన్నా బృందంపై మంచు కొండల నేపథ్యంలో చిత్రీకరించారు.

ప్రోమోను బట్టి ఇదో రొమాంటిక్‌ సాంగ్‌లా అనిపిస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. తమన్నా హాట్ లుక్ అదిరింది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటను మహతి స్వరసాగర్, విజయ్‌ప్రకాష్, సంజన్ ఆలపించారు. తమిళంలో విజయం సాధించిన వేదాళం సినిమాకు ఇది రీమేక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu