గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చాలా ఆస్తికరంగా అనిపించింది. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం…
భీమా కథ ‘పరశురామక్షేత్రం’ చుట్టూ తిరుగుతుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘పరశురామక్షేత్రం’లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఏవిధంగా ఛేదించాడు? అతనికి పరశురామక్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటనేదే భీమా కథ. ఈ సినిమాలో..భీమా, రామా అనే డ్యుయెల్ రోల్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు గోపీచంద్.
ఇది చాలా డిఫరెంట్ మూవీ. కన్నడ దర్శకుడు.. గోపీచంద్‌లోని మాస్ యాంగిల్‌కి పదునుపెట్టి.. డీవోషనల్ టచ్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో అసలు కథ జోలికి పోకుండా.. లవ్ స్టోరీలు, పాటలు, ఫైట్లు, ఎలివేషన్స్‌తోనే లాక్కొచ్చాడు. ఆత్మలు, సంజీవని అంటూ కొత్తగా ట్రై చేశారు కానీ.. కథలోని మెయిన్ పాయింట్ పక్కదారి పట్టడంతో.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓస్ ఇంతేనా? అనేట్టు చేశారు. కొన్నాళ్లు ముందు.. కొన్నాళ్ల తరువాత అంటూ.. కథను అటు తిప్పి ఇటు తప్పి.. కన్ఫ్యూజ్ చేసేశారు.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ పాత్ర ప్రత్యేకం. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అతనికి కొట్టినపిండి. కంటెంట్‌లో పెద్దగా విషయం లేకపోయినా తన కటౌట్‌తో నిలబెట్టేస్తుంటాడు గోపీచంద్. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా.. బ్రాహ్మణుడిగా డిఫరెంట్ షేడ్స్ చూపించారు. యాక్షన్ ఎపిసోడ్‌లతో పాటు.. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించారు. అయితే లవ్ ట్రాక్ మాత్రం గోపీచంద్‌కి వర్కౌట్ కాలేదు.
హర్ష.. దర్శకుడే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. గతంలో ఇదే బ్యానర్‌లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాకి కొరియోగ్రఫీ అందించిన హర్ష. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించడం విశేషం. కన్నడలో అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో సర్ ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని బయటపెట్టారు. భారీ టెంపుల్ సెట్ హైలైట్.. కథకి కావాల్సిన క్వాలిటీ ఇచ్చారు. ఎక్కడా రాజీ పడలేదు. వీఎఫ్ఎక్స్ వర్క్‌కి ప్రాధాన్యత కల్పించారు. ఆయుర్వేద వైద్యుడు రవీంద్ర వర్మగా నాజర్ క్యారెక్టర్‌గా ప్రీ క్లైమాక్స్ వరకూ సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇక ముదురు వయసు బ్రహ్మణ ప్రేమికుడిగా నరేష్.. తనకి సూటయ్యే పాత్ర చేశాడు.