టాలీవుడ్ హీరో నితిన్, ముద్దుగుమ్మ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘భీష్మ’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా పాటల షూటింగ్ కోసం రోమ్ వెళ్లిన భీష్మ టీం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు.
ఇక రోమ్‌లో సందడి చేస్తున్న భీష్మ టీం వరుస అప్‌డేట్స్‌తో సినీ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. తొలి సాంగ్ ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన వీడియో హల్‌చల్ చేస్తుండగానే మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు అంకితమిస్తూ అతడు నటించిన ‘వార్’ చిత్రంలోని ‘గుంగ్రూ’ అనే పాటకు నితిన్, రష్మికలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోను రష్మిక తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట గ్లింప్స్‌తో ‘భీష్మ’ పై హై ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి. లవ్ అండ్ రొమాంటిక్ జానర్‌లో తెరకెక్కడం, రష్మిక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నితిన్ యాటిట్యూడ్ సినిమాకు మరింత బలం చేకూరనుంది. ఇక వార్ చిత్రంలోని ‘గంగ్రూ’సాంగ్ ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జిత్ సింగ్, శిల్పారావు పాడిన ఈ పాటకు యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 2019లో మోస్ట్ పాపులర్ సాంగ్‌గా నిలిచింది.
Love to you @iHrithik sir,,
From #Bheeshma team from Positano✨💕
Ps. Sorry for the no sync in music. 😋@actor_nithiin @VenkyKudumula pic.twitter.com/yn3DSGdPZN— Rashmika Mandanna (@iamRashmika) December 26, 2019
MERRY CHRISTMAS 🎄 #Bheeshma1stSingleOnDec27th pic.twitter.com/gUHiA6CLVR
— nithiin (@actor_nithiin) December 25, 2019