టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహరీన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇటీవలే మెహ్రీన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన యంగ్ పొలిటికల్ లీడర్ భవ్య బిష్ణోయిని మెహరీన్ పెళ్లి చేసుకోబోతుంది. త్వరలో రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లికి జరగబోతుందట. ఇటీవలే ఈ జంట మార్చి 13న నిశ్చితార్థం చేసుకున్నారు. భవ్య బిష్ణోయ్ పుట్టినరోజు సందర్భంగా మెహరీన్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన ప్రేమను తెలిపింది. అసలు ఎలా ప్రొపోజ్ జరిగింది అనే విషయం చెప్పుకొచ్చింది. భవ్య పుట్టినరోజు సమయంలో అండమాన్ కు వెళ్ళాము. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు అండర్ వాటర్ లో ఉన్నప్పుడు భవ్య ప్రపోస్ చేసాడట. నీటిలో భవ్య దగ్గరకు వచ్చి తనకు.. “విల్ యూ మ్యారీ మీ..?” అనే ప్రపోసల్ కార్డు చూపించి లవ్ ప్రపోజ్ చేశాడని మెహ్రీన్ తెలిపింది. ఆ ప్రపోసల్ చాలా స్పెషల్ అంటోంది మెహరీన్. వీరి ఎంగేజ్మెంట్ ఈవెంట్ రాజస్థాన్ లోని జైపూర్ అలీలా కోటలో జరుపుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు చెప్పింది.