HomeOTTBharateeyudu 2: కమల్ హాసన్ సినిమాకి మళ్లీ ట్రోలింగ్ తప్పదా

Bharateeyudu 2: కమల్ హాసన్ సినిమాకి మళ్లీ ట్రోలింగ్ తప్పదా

Bharateeyudu 2 to face criticism again
Bharateeyudu 2 to face criticism again

Bharateeyudu 2 OTT:

1996లో కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ కల్ట్ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 మళ్లీ అదే కాంబినేషన్లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్లకి కూడా తీరని నష్టాలను కలిగించింది. విడుదలైన మొదటి రోజు నుంచే.. సినిమా మీద ఒక రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. సినిమా విడుదలై వారాలు గడిచినా కూడా ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా పోలేదు. అభిమానులు ఇప్పటికీ భారతీయుడు 2 సినిమా మీద విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా శంకర్ నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ మీదకి ఫ్యాన్స్ దృష్టి మళ్లింది. దీంతో భారతీయుడు 2 పేరు మళ్లీ వినిపించదు అనుకుంటున్నా సమయంలో.. మరొకసారి సినిమా మీద ట్రోలింగ్ మొదలయ్యేలాగా కనిపిస్తోంది. దానికి కారణం సినిమాని ఓటీటీ లో విడుదల చేయడం. నిన్న మొన్నటిదాకా సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో.. కొంచెం గొడవలు వచ్చాయి కానీ.. అవన్నీ ఇప్పుడు ఒక కొలీక్కి వచ్చాయి.

డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారతీయుడు 2 సినిమా అన్ని భాషలలోనూ.. ఆగస్టు 9న విడుదలవుతుంది అని ప్రకటించింది. థియేటర్లలో ఎలాగో సినిమా మీద ట్రోలింగ్ తప్పలేదు. కానీ ఇప్పుడు సినిమా ఓటీటీ లో విడుదలవుతుంది. దీంతో మరొకసారి ఈ సినిమా మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలయ్యేలాగానే కనిపిస్తోంది.

ఏదేమైనా ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం మీద.. మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాకి రెండవ భాగంగా.. భారతీయుడు 3 కూడా విడుదల కాబోతోంది. మరి ఆ సినిమా సంగతి ఏమవుతుందో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu