ప్రముఖ నటి భానుప్రియపై సామర్లకోటలో ప్రభావతి అనే మహిళా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురిని హింసిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని కేసు పెట్టింది. ఈ కేసుపై నటి భానుప్రియ స్పందించింది. ప్రభావతి కూతురు తన దగ్గర సంవత్సరం నుంచి పనిచేస్తుందని, అప్పుడప్పుడు చేతివాటంచూపించి, దొంగిలించిన వస్తువులను తన తల్లికి ఇచ్చేదని, వస్తువుల గురించి ప్రశ్నించగా, చెన్నై వచ్చిన ప్రభావతి కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, మిగతా వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లి.. తనపై కేసు పెట్టిందని భానుప్రియ వివరణ ఇచ్చింది.
భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న ఆమె కూతురు కూడా మీడియాతో మాట్లాడింది. భానుప్రియ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, తనను ఎవరు హెరాస్ చేయలేదని చెప్పింది. దొంగిలించిన వస్తువులను తల్లి తీసుకొస్తానని చెప్పి కేసు పెట్టిందని మీడియాకు చెప్పడం విశేషం.