టాలీవుడ్‌లో అల్లుఅర్జున్ నటించిన వరుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది భానుశ్రీ మెహ్రా. ఈ సినిమా హిట్ కాలేకపోవడంతో.. ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకు వచ్చే ప్రయత్నం చేసింది.. కానీ అక్కడ కూడా సక్సెస్ దక్కలేదు. ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ అమ్మడు.. తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భానుశ్రీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నటీమణుల వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. అవును ఇది నిజం అండి. ఒక వయసు వచ్చిన తర్వాత నటీమణులను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తూ ఉంటారు. అదే నటుల విషయానికి వచ్చేసరికి వ్యవహారం వేరేలా ఉంటుంది. హీరోలకు ఎంత వయసు ఉన్నా.. వాళ్లు ఎప్పటిలాగానే మెయిన్ క్యారెక్టర్స్ లోనే నటిస్తుంటారు.
తమకంటే వయసులో చాలా చిన్నవారైనా హీరోయిన్స్ కి ప్రేమికుడిగా కనిపిస్తారు. అసలు నటీమణుల విలువను ఆమె వయసుని ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు? పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. ధైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను ప్రేక్షకులకు చెప్పండి. అన్ని వయసుల నటీమణులను పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది అంటూ భానుశ్రీ మాట్లాడింది.
ఈ వ్యాఖ్యలను నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. నాలుగు పదులు.. ఐదు పదుల వయసులో కూడా ఎంతో మంది హీరోయిన్స్ నటించడం మీకు కనిపించడం లేదా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవ లేదు. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష సినిమా ఇండస్ట్రీల్లో కూడా వయసు పెరిగిన హీరోయిన్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే మరి కొందరు మాత్రం భాను శ్రీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు